మాచర్ల పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘ అధికారులు సిబ్బందితో కలిసి సోమవారం సైతం సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులతో కలిసి పట్టణంలోని దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లభించిన లగేజీ కవర్లను చించి వేసి వ్యాపారస్థులకు వినియోగదారులకు అవగాహన కల్పించారు. వినియోగదారులు జూట్ బ్యాగులను మాత్రమే వాడాలని సూచించారు.