దోశలు పోస్తూ.. ప్రచారం నిర్వహించిన మురుగుడు లావణ్య

6724చూసినవారు
దోశలు పోస్తూ.. ప్రచారం నిర్వహించిన మురుగుడు లావణ్య
మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య బుధవారం నగరంలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా స్థానికంగా ఉన్న ఓ హోటల్ లోకి ఆమె వెళ్లి స్వయంగా దోశలు పోసి వినియోగదారులకు అందజేసి వినూత్న రీతిలో తన ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం గడపగడపకు వెళ్లి తనకు ఓటువేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా పలువురు స్థానికులు ఆమెకు హారతులు పట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్