తాడేపల్లి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు శనివారం ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు. 65వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్య క్షురాలు ఆరుద్ర భూలక్ష్మి కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.