దోమల కారణంగా మలేరియా వ్యాప్తి

588చూసినవారు
మలేరియా వ్యాధి దోమల వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని రొంపిచర్ల వైద్యాధికారి జగన్ నరసింహారెడ్డి అన్నారు. మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. దోమల నివారణను ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించారు. నీటి నిల్వలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల్లో ఉన్న రోళ్ళు, పాత టైర్లలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్