రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛత దివస్- స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. శనివారం పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరె నరసరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని, అనంతరం పచ్చదనం పెంపొందించే చర్యలో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు.