పల్నాడు జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని మంగళవారం కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. డీఈవో చంద్రకళ, మండల విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. నూటికి నూరు శాతం పరీక్ష ఫలితాలు సాధించాలన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు అనే పిలుపును అమలు చేసి, పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలన్నారు.