మార్టూరు మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద లారీలో డ్రైవర్ రవిచంద్రన్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. చెన్నై నుండి విజయవాడ వెళుతున్న లారీ టోల్ ప్లాజా వద్దకు వచ్చే సరికి మరొక డ్రైవర్ అతనిలో చలనం లేకపోవటం గమనించి 108 కు ఫోన్ చేశాడు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని అతన్ని పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు.