పంచరామ క్షేత్రాల్లో ప్రధానమైన శ్రీ బాల చాముండిక సమేత అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులలో కొందరు ఆకతాయిలు కారు పార్కింగ్ విషయంలో గురువారం వివాదానికి దిగారు. మాట, మాట పెరిగి సమీపంలో ఉన్న కుర్చీలను పగలగొట్టినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆకతాయిలకు బుద్ధి చెప్పి, నూతన కుర్చీలు ఇచ్చేలా ఏర్పాటు చేశారు.