పెదకూరపాడు మండలంలోని లగడపాడు గ్రామంలో మంగళవారం సంఘం డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరీ సూపర్వైజర్ ప్రసాదు పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సంఘం డైరీ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి సేవలు అందించడంలో ముందంజలో ఉన్నామన్నారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు, సంగం డైరీ అధ్యక్షులు బత్తుల కోటేశ్వరరావు పాల్గొన్నారు.