పెదకూరపాడు 14వ డిసి సంఘం పరిధిలోని నీటి సంఘం ఎన్నికల షెడ్యూల్ ను తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఎన్నికల అధికారి రత్న చందర్రావు ఆధ్వర్యంలో నోటీస్ బోర్డ్ లో సర్క్యులర్ అందించారు. ఓటర్లు తమ ఓటులను షెడ్యూల్లో పరిశీలించుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డానియల్ ఏవో శాంతి ఎలక్షన్ అసిస్టెంట్ ఏవో గౌతమి, సిబ్బంది పాల్గొన్నారు.