అమరావతి ప్రాంతాన్ని మంగళవారం తెల్లవారుజామున నుంచే పొగ మంచు కమ్మేసింది. రహదారి మొత్తం మంచు దుప్పటి కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనదారులు పట్టపగలే హెడ్ లైట్లను వేసుకొని నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తున్నారు. సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ మంచు తీవ్రంగా ఉండటంతో సీడ్ యాక్సిస్ రోడ్డుపై వెళ్ళే వాహనదారులకు సవాలుగా మారింది.