క్రోసూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ డే జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ
విద్యార్థులు అధికంగా మొబైల్ ఫోన్లు, టీవీల ముందు కూర్చొని చదువును పక్కన పెడుతున్నారని తల్లిదండ్రులు గమనించాలని కోరారు. క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత శిఖరాల వైపుకు నడిపిస్తుందని ఆయన అన్నారు.