విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పెదకూరపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కడప జిల్లా పులివెందులలో సాక్షి విలేకరులపై దాడి చేసిన వారిని శిక్షించాలని తహసీల్దార్ మీసాలు దానియేలుకు వినతి పత్రాన్ని అందించారు. ప్రెస్ క్లబ్ నాయకులు పరగటి రాజు, పర్చూరు పూర్ణచంద్రరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.