మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు "అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి" అనే కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు రైతులతో ర్యాలీ, విజ్ఞాపన పత్రం అందజేయు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ నీ బుధవారం పొన్నూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరారు.