ప్రత్తిపాడు తెదేపా కార్యాలయంలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల మాట్లాడుతూ పేదల అపద్భాందవుడు అంబేడ్కర్ అయితే నేడు పేదల పెన్నిధి సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.