వరి పైరును ఆశించే ఎలుకలను నివారిస్తే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని కాకుమాను ఏవో కిరణ్మయి పేర్కొన్నారు. మంగళవారం గరికపాడు, తెలగాయపాలెం గ్రామాలలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం జరిగింది. బ్రోమోడయోలిన్ విషపూరిత ముందు నూకలలో కలిపి బొరియల దగ్గర ఉంచాలని ఎలుకలు తిని చనిపోతాయని ఏవో సూచించారు. కార్యక్రమంలో రైతులకు ఉచితంగా ఎలుకల నివారణ మందును పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.