ప్రత్తిపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కాకుమాను మండలం కొమ్మూరు గ్రామవాసి అయ్యలూరి తాజ్ మేస్త్రి సోమవారం పెదనందిపాడు మండల గ్రామంలో చిలకలూరి పేట బస్సులో ఎక్కి కనిపించకుండా వెళ్లిపోయాడు. మంగళవారం ఆత్మకూరు పంట పొలాలలో మృతి చెందిన వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయ్యలూరి తాజ్ మేస్త్రి అని అనుమానంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.