నిషేదిత గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని రేపల్లె పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.మండలంలోని బేతపూడిలో పల్లెకోన వెళ్ళే రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఆర్బికె సచివాలయం వద్ద గంజాయి విక్రయిస్తున్న సమాచారం అందగా దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ మల్లిఖార్జునరావు తెలిపారు.కలగట్ల భాను ప్రకాష్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు.వారి వద్ద నుండి 2కేజీల గంజాయి, బైకు స్వాధీనపరుచుకున్నామన్నారు.