కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాజుపాలెం మండలం రాజుపాలెం తహశీల్దార్ ఆఫీస్ దగ్గర కేఎల్ రావు పులిచింతల ముంపు ప్రాంతాల నివాసితులకు గృహ పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకం అందించడం జరుగుతుంది తెలిపారు.