వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని నకరికల్లు ఎస్ఐ సి. హెచ్. సురేష్ తెలిపారు. నకరికల్లు స్ధానిక పోలీస్ స్టేషను నందు బుధవారం నాడు చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారితో సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు చేసారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవ మండపంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ప్రతి రోజు రాత్రులలో ఇద్దరు పడుకోవాలని, విగ్రహం వద్ద సి. సి. కెమెరాలు ఏర్పాటు చేయ్యాలని చెప్పారు.