కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని అమరావతి దళిత జేఏసీ నేత వలపర్ల ఏసుదాసు అన్నారు. శుక్రవారం తుళ్లూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.