బీజేపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు బాగుచేయాలని ఆదివారం కంతేరు నుంచి తాడికొండ వెళ్లే రోడ్డులో దారుణంగా దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఎర్రవాగు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా వెంకటశివన్నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న ఆర్ అండ్ బీ రోడ్ల వలన ఎంతో మంది ఇక్కట్లు పడుతున్నారన్నారు. ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని వెంటనే ఆర్ అండ్ బీ రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బిట్రా వెంకటశివన్నారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు సీహెచ్. సీతాదేవి, తాడికొండ బీజేపీ సీనియర్ నాయకుడు బండ్లమూడి సాంబశివరావు, శిఖా సాంబయ్య, కుక్కమళ్ల శివ, బిట్రా పూర్ణబ్రహ్మేశ్వరరావు, దార్న సాంబశివరావు, సుంకర వెంకటకృష్ణ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.