తుళ్లూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం గత ఆరు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. రాజధాని ప్రాంతం కావటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలు తరచూ ఉత్పన్న మౌతున్నాయి. మూత బడిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని తిరిగి అభివృద్ధి పరచి, పునః ప్రారంభించాలని శనివారం తుళ్లూరు ప్రజలు అధికారులను కోరుతున్నారు.