తెనాలి : రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి నాదెండ్ల
సహనా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలుగా అండగా ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా కల్పించారు. ఇటీవల బ్రెయిన్ డెడ్ కు గురై మరణించిన తెనాలి ఐతానగర్ కు చెందిన కుమారి మధిర సహాన భౌతికకాయనికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.