గ్రామ దేవత అంకమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా

50చూసినవారు
వేమూరు మండల పరిధిలోని చావలి గ్రామంలో గ్రామ దేవత అంకమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న అమ్మవారి జాతర కార్యక్రమం సోమవారం గ్రామంలో ఊరేగింపుగా గ్రామ దర్శనం జరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై అమ్మవారికి నూతన వస్త్రాలు బహుకరించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి పీఠాన్ని తల మీదకు ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్