భట్టిప్రోలు లో ఘనంగా రంజాన్ వేడుకలు

73చూసినవారు
భట్టిప్రోలు లో ఘనంగా రంజాన్ వేడుకలు
రంజాన్ పండుగ సందర్భంగా మండల కేంద్రం భట్టిప్రోలులో ముస్లిం సోదరులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. 30 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం బుధవారం రాత్రి నెలవంకను చూసిన ముస్లిం సోదరులు గురువారం నాడు రంజాన్ పండుగను నిర్వహించారు. ఉదయాన్నే మసీదులకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అందరూ కలిసి గ్రామ సమీపంలో ఉన్న ఈద్గాల వద్దకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్