వేమూరు: రాజకీయ కక్షతోనే మోటార్ షెడ్డును తగలబెట్టారు
వేమూరు మండలంలోని పెరవలి గ్రామంలో దండే శ్రీనివాసరావుకు చెందిన మోటార్ షెడ్డును బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. పాకలో ఉన్న 3 మోటార్లు, ఒక ఆయిల్ ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. ఘటనలో సుమారు రూ.1.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఇది రాజకీయ ప్రత్యర్ధుల దుశ్చర్యగా బాధితుడు భావిస్తున్నాడు. దీనిపై వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రవికృష్ణ కేసు నమోదు చేశారు.