వినుకొండ మండలంలో పిట్టంబండలో బుధవారం రెవెన్యూ సదస్సును అధికారులు నిర్వహించారు. తహశీల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు వారికి అర్జీలు అందించారు. అర్జీలను పరిశీలించి, పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.