వినుకొండ: చికిత్స పొందుతూ హోంగార్డ్ మృతి

82చూసినవారు
వినుకొండ: చికిత్స పొందుతూ హోంగార్డ్ మృతి
వినుకొండ నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ లలో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహించిన మల్లవరపు అజయ్ ఆదివారం మృతి చెందాడు. అజయ్ కు గుండెపోటు రావటంతో గుంటూరులోని ఓ హాస్పిటల్ కు 4రోజులు క్రితం తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని అతని స్వగ్రామం వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామానికి తరలిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్