ఏపీ హైకోర్టు గురువారం పోసాని పిటిషన్లను విచారించనుంది. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పోసాని కృష్ణ మురళి అమరావతి హైకోర్టులో ఐదు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ ఐదు పిటిషన్లను హైకోర్టు మరికాసేపట్లో విచారించనుంది.