యూపీలోని అక్బర్‌పురాలో వింత ఘటన చోటుచేసుకుంది. బైక్‌లో పెట్రోల్ పోయించడానికి ఒకతను పెట్రోల్ బంకుకు వెళ్లాడు. అయితే బైకర్ హెల్మెట్ ధరించకపోవడంతో పెట్రోల్ బాయ్ అతడికి పెట్రోల్ పోయడానికి నిరాకరించాడు. దీంతో అతడు స్నేహితులతో కలిసి పెట్రోల్ బాయ్‌పై దాడి చేసి అతడి దగ్గర ఉన్న రూ.30వేల నగదును ఎత్తుకెళ్లాడు. బంకు యజమాని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరుపుతున్నారు.