టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ శ్రీకాంత్ భారత్ వైసీపీ పార్టీని పరోక్షంగా విమర్శించారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మొదట అంకెలు అప్పజెప్పుతానని వరుసగా ఒకటి నుంచి పది వరకు చెప్పి 11 నంబర్ రాగానే.. ఏ ఛీ పక్కనా పెట్టు అని వైసీపీపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. అయితే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే.