AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. జగన్ ఇంగితం లేకుండా మాట్లాడితే తామూ 'జగన్ కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ' అని అనగలమని హెచ్చరించారు. వైకాపాకు ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేసే స్థాయిలో జగన్ లేరని, ఇది ప్రజలిచ్చేది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు.