పెద్దిరెడ్డి భూ అక్రమాలు నిజమే: త్రిసభ్య కమిటీ

55చూసినవారు
పెద్దిరెడ్డి భూ అక్రమాలు నిజమే: త్రిసభ్య కమిటీ
AP: వైసీపీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూమిని ఆక్రమించడం నిజమేనని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. పెద్దిరెడ్డి కుటుంబం.. మంగళంపేట అటవీ ప్రాంతంలో 27.98 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడిందని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన సంయుక్త కమిటీ నిర్దారించింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ధ్రువీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్