AP: తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి మొదటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం 181 గ్రామాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. కమలాపురం , తాటిచర్లలో 42.6, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.5 డిగ్రీలు నమోదైంది. శనివారం 35 మండలాల్లో వడగాలులు, 233 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.