బాలశౌరికి కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మేనా..?

82చూసినవారు
బాలశౌరికి కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మేనా..?
వల్లభనేని బాలశౌరి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. జనసేన పోటీ చేసిన రెండు స్థానాల(మచిలీపట్నం, కాకినాడ)లో బాలశౌరి సీనియర్ నేత. పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తి కావడంతో ఇప్పుడు ఆయనపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర కేబినెట్‌లో బాల‌శౌరికి బెర్త్ ఖాయ‌మేన‌ని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్