AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్న పదవి కోసం కూటమి నేతలు దారుణాలు చేశారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయని అన్నారు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో YCP గెలుపు ఖాయమని జగన్ జోస్యం చెప్పారు. కరోనా కారణంగా కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేదని, జగన్ 2.O భిన్నంగా ఉంటుందని, కార్యకర్తల కోసం నిలబడతా అని జగన్ హామీ ఇచ్చారు.