ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో ఇద్దరు యువకుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ ఇద్దరు యువకులు స్నేహితులు కావడం. ఓ అమ్మాయి కోసం ఇద్దరు యువకులు నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో ఒకరినొకరు దూషిస్తూ తీవ్రంగా దాడి చేసుకున్నారు. వారిద్దరు అలా కొట్టుకుంటున్నా ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.