మధ్యప్రదేశ్‌లోని మండ్లా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలకు మావోయిస్టులు లేఖ విడుదల చేసిన వేళ ఈ ఎన్‌కౌంటర్ జరగడం చర్చనీయాంశంగా మారింది. 4 గంటల పాటు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా DGP కైలాశ్ మక్వానా వెల్లడించారు.