AP: కాపుల విషయం మాజీ సీఎం వైఎస్ జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన కార్యకర్త దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్ చాలా హుందాగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జగన్.. ముద్రగడ పద్మానాభాన్ని ఫోన్‌లో పరామర్శించారు. 20 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముద్రగడ ఈ దాడి ఎలా జరిగిందనే విషయాన్ని జగన్‌కు వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఉంటారని ముద్రగడకు జగన్ స్పష్టం చేశారు.