టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి సోమవారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో అతియా శెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సినీ, క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అతియా, కేఎల్ రాహుల్ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సోమవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు.