55 కుటుంబాలు టిడిపి నుండి వైసిపిలో చేరిక

571చూసినవారు
55 కుటుంబాలు టిడిపి నుండి వైసిపిలో చేరిక
బద్వేలు నియోజకవర్గం వైసిపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి సమక్షంలో శనివారం శ్రీ అవధూత కాశి నాయన మండలం కోడిగుడ్లపాడు గ్రామంలో గుర్రాల వెంకటరెడ్డితో పాటు ఆయన అనుచరులు, 55 కుటుంబాలు టిడిపి నుండి వైసిపిలో చేరారు. వీరికి విశ్వనాథరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్