ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఎమ్మెల్సీ గోవింద రెడ్డి పేర్కొన్నారు. శనివారం పోరుమామిళ్లలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రాంతం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నియోజవర్గంలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలకు నామినేషన్ అనే పేరు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు ఏకపక్షంగా ప్రవర్తించారన్నారని ఆరోపించారు.