వైఎస్సార్ సీపీ జిల్లా సెక్రటరీ యాక్టివేట్ కన్వీనర్ గా నియమితులైన పి. రాజశేఖర్ రెడ్డి పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని కలిశారు. పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. పలు పదవుల్లో నూతనంగా నియమితులైన వారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు.