కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం జిల్లా మహాసభలు

69చూసినవారు
కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం జిల్లా మహాసభలు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో బుధవారం సిపిఎం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, డిసెంబర్ 14, 15 తేదీలలో కడపలో 12వ మహాసభలు జరగనున్నట్లు ప్రకటించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుట్టాలన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్