కొండాపురం మండలంలోని ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26. 85 టీఎంసీలు కాగా గురువారం 25. 89 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు జలవనరుల శాఖ ఈఈ ఉమా మహేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. గండికోట జలాశయం నుంచి జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా కమలాపురం చెరువుకు 200 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గండికోట జలాశయం లోనికి ఇన్ ఫ్లో ఏమీ లేదన్నారు.