జమ్మలమడుగు: సోంపల్లె గ్రామంలో ఘనంగా దొడ్డి దేవర

84చూసినవారు
ముద్దనూరు మండలం సొంపల్లె గ్రామంలో కార్తీకమాసం పురస్కరించుకొని మూడో వారంలో మూడేళ్లకు ఒకసారి దొడ్డి దేవరను యాదవ సోదరులు సోమవారం ఘనంగా నిర్వహించారు. గొర్రెల దొడ్డి వద్ద యాదవ సోదరులు దొడ్డి గంగమ్మను అందంగా బంతి పూలతో ముస్తాబు చేశారు. పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గును వందలాది గొర్రెలతో తొక్కించారు. అనంతరం గంగమ్మకు బోనాలు పెట్టి పెద్ద ఎత్తున యాటలు కోసి మొక్కు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్