భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి వేడుకలను పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం జమ్మలమడుగు పట్టణంలో నిర్వహించిన వాజ్ పేయి జయంతి వేడుకలకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వాజ్ పేయి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కూటమి ప్రభుత్వ నాయకులు హాజరై వాజ్ పేయి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.