ముద్దనూరు మండలంలోని చౌటిపల్లెలో లింగమయ్య స్వామి తిరుణాల ఈనెల 23 గురువారం జరగనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ చౌటిపల్లె గండికోట జలాశయం వెనుక జలాల నీళ్ల కింద ముంపునకు గురికాగా అక్కడివాసులు ముద్దనూరు, కొండాపురం మండలంలో రెండుప్రాంతాలలో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు చోట్ల లింగమయ్య స్వాములకు తిరుణాలను జరుపుతున్నారు.