జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని మస్టర్ పాయింట్ వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో.. మున్సిపల్ పారిశుద్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ యూనియన్ నాయకులు, పారిశుద్య కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు.